'మా' ఎలక్షన్స్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు మాటల యుద్ధం కొనసాగుతుంది. మంగళవారం కొత్తగా పోస్టల్ బ్యాలెట్ వివాదం ఏర్పడింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మంచు విష్ణు ప్యానల్ పోస్టల్ బ్యాలెట్ ను దుర్వినియోగం చేస్తుందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు ఫిర్యాదు చేశారు. 

కరోనా కారణంగా తొలిసారిగా మా ఎలక్షన్స్ లో పోస్టల్ బ్యాలెట్ విధానం పెట్టం. మాలో 60 ఏళ్లుపడి బడిన సభ్యులు 125 మంది ఉన్నారు. వారిలో 60 మంది పోస్టర్ బ్యాలెట్ కావాలని అడిగారు. వారికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పంపిస్తాం. పోస్టల్ బ్యాలెట్ పేపర్ కు నామినల్ గా 500 చెల్లించాలని ఆయన అన్నారు. 

ఈ క్రమంలో సీనియర్ ఆర్టిస్ట్ ల బ్యాలెట్ పేపర్ విధానం కు మంచి విష్ణుకి చెందిన మనుషులు డబ్బు చెల్లించడంపై ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. ఇలా ఎన్నికల్లో గెలవాలనుకోవడం తప్పని.. కృష్ణం రాజు, కృష్ణ, పరుచూరి బ్రదర్స్ వారి బ్యాలెట్ పత్రాలకు మంచు విష్ణు డబ్బులు కట్టారని అన్నారు. అయితే ఒకే వ్యక్తి డబ్బులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి.. పోస్టర్ బ్యాలెట్ కు చెల్లించిన 28 వేలు తిరిగి ఇచ్చేశామని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ అన్నారు.