ఆచార్య రిలీజ్ ఎప్పుడు..?

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరుతో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. కాజల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. కొన్నాళ్లుగా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్ పై కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది.  

ఫైనల్ గా ఆచార్యని డిసెంబర్ 17, 24 డేట్లలో ఒక డేట్ న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అయితే డిసెంబర్ 17న ఆల్రెడీ అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ ప్రకటించాడు. బన్నీకి పోటీగా మెగా మూవీ అంటే ఇబ్బందే.. అందుకే మెగాస్టార్ ఆచార్య దాదాపు డిసెంబర్ 24న రిలీజ్ ఫిక్స్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆచార్య యూనిట్ నుండి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.