అఖండ మొత్తానికి పూర్తి చేశారు..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న మూవీ అఖండ. సింహా, లెజెండ్ తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న థర్డ్ మూవీగా అఖండ మీద భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ కూడా అంచనాలకు తగినట్టుగా ఉండటంతో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. 

అఖండ షూటింగ్ పూర్తయినట్టు మంగళవారం అధికారికంగా వెల్లడించారు. సినిమా రిలీజ్ కూడా త్వరలోనే ఉంటుందని తెలుస్తుంది. నవంబర్, డిసెంబర్ లో అఖండ రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.