జనవరి 7న RRR.. ఈసారి ఫిక్స్..!

రాజమౌళి డైరక్షన్ లో చరన్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. రియల్ హీరోస్ అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పాత్రలతో చరణ్, ఎన్.టి.ఆర్ అలరించడానికి సిద్ధమయ్యారు. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచాయి. 2021 జవరి, ఆ తర్వాత జూలై ఫైనల్ గా అక్టోబర్ 13 ఇలా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ వాయిదా వేస్తూ వస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రయూనిట్ ఫైనల్ గా మరో రిలీజ్ డేట్ ప్రకటించింది.


ఈ ఇయర్ వదిలిపెట్టేసిన ట్రిపుల్ ఆర్ టీం.. 2022 జనవరి 7న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఆల్రెడీ సంక్రాంతి రేసులో భారీ సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇక ఇప్పుడు సంక్రాంతికి వారం ముందు ఆర్.ఆర్.ఆర్ రాబోతుంది. ట్రిపుల్ ఆర్ ముందు మిగతా సినిమాలు తట్టుకోవడం కష్టమే. అయితే జనవరి 7 నుండి ఐదు రోజులు వదిలిపెడితే సంక్రాంతి సినిమాలు 12 నుండి రిలీజ్ అవుతాయి కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేదని అంటున్నారు. ఏది ఏమైనా సడెన్ గా సంక్రాంతికి ముందు ట్రిపుల్ ఆర్ రిలీజ్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు రాజమౌళి.