వరాహావతారంలో మహేష్..?

సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. గీతా గోవిందం తర్వాత పరశురాం చేస్తున్న ఈ సినిమా మాస్ ఆడియెన్స్ కు నచ్చేలా కొన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేశాడట పరశురాం. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోతుందని అంటున్నారు.

సినిమా ఇంటర్వల్ ను సింహాచలం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారట. అందుకే ఇంటర్వల్ ఫైట్ లో విలన్ సముద్రఖనికి మహేష్ వరాహావతారంలో కనిపిస్తాడట. మహేష్ ఇంతవరకు పౌరాణిక పాత్రల్లో కనిపించింది లేదు. మరి అలాంటప్పుడు పరశురాం మహేష్ ను ఎలా చూపిస్తున్నాడు అన్న దానిపై ఆసక్తి పెరిగింది. సినిమాలో ఈ సీన్ చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.