
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్, దాక్కో దాక్కో మేక సాంగ్ సినిమాపై అంచనాలు పెంచాయి.
డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేసిన పుష్ప మూవీ మొదట్లో క్రిస్ మస్ రేసులో దించాలని అనుకోగా.. ఫైనల్ గా డిసెంబర్ 17న సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. రెండు పార్టులుగా వస్తున్న పుష్ప సినిమా పుష్ప పార్ట్ 1 డిసెంబర్ 17న రిలీజ్ అవుతుంది. సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్ తో కనిపిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.