
అల్లు రామలింగయ్య శర జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలో హోమియోపతి వైద్య కళశాలను సందర్శించడమే కాకుండా అక్కడ అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు మెగాస్టార్ చిరంజీవి. అల్లు రామలింగయ్య గారికి తనకు గురు శిష్యుల అనుబంధం ఉండేదని అన్నారు. ఆయన్ను తాను మొదటిగా రాజమండ్రిలోనే కలిశానని.. నటుడిగా తన ప్రయాణం రాజమండ్రిలోనే మొదలైందని అన్నారు చిరంజీవి.
పునాదిరాళ్లు, మన ఊరి పాండవులు ఇలా ఎన్నో సినిమలు ఇక్కడే షూటింగ్ జరిగాయి. మన ఊరి పాండవులు షూటింగ్ టైం లోనే తనని ఆయన అల్లుడిగా ఫిక్స్ అయిపోయినట్లునారని అన్నారు చిరు. అలా మొదలైన మా పరిచయం మంచి అనుబంధంగా మారిందని అన్నారు. సినిమాల్లో హాస్యాన్ని పండించినా రియల్ లైఫ్ లో జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు రామలింగయ్య. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు.. హోమొయోపతి గురించి ఆయన చెప్పేవారు. హోమియోపతి మీద ఉన్న ఆసక్తితో శిషణ తీసుకున్నారు. ఇప్పటికీ తాము హోమియోపతి మందులనే వాడుతుంటామని అన్నారు చిరు. చిన్న ఊరిలో జన్మించినా పట్టుదలతో సినిమాల్లోకి వచ్చి అనుకున్నది సాధించి పద్మశ్రీ పొందడం విశేషమని అన్నారు చిరు.