మంచు విష్ణుకే నా సపోర్ట్.. ఎందుకంటే..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ డేట్ దగ్గర పడుతున్న టైం లో ప్రధాన పోటీదారుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నామినేషన్స్ వేస్తూ అన్నిటిలో తామే ముందున్నామని ప్రకాష్ రాజ్ చెప్పగా.. మంగళవారం నామినేషన్స్ వేసిన మంచు విష్ణు గెలుపు తమ ప్యానల్ దే అన్నట్టు మాట్లాడారు. ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న నరేష్ తన మద్ధతుని మంచు విష్ణు ప్యానల్ కు ప్రకటించారు. మంచు విష్ణు ప్యానల్ లో పూర్తిగా సమర్ధులు.. కష్టపడే వారు ఉన్నారు. వీరి వల్ల ఖచ్చితంగా మా లో మంచి జరుగుతుందని అన్నారు నరేష్.

అధ్యక్షుడిగా తాను చాలా మంచి పనులు చేశాను. ఆ టైం లో నాతో ఉన్న వారు ఇప్పుడు మంచు విష్ణు ప్యానల్ లో ఉనారని అన్నారు. మంచు విష్ణు మంచి విజన్ ఉన్న వ్యక్తి.. ఖచ్చితంగా మా కోసం ఆయన కష్టపడాతరని అన్నారు నరేష్. మంచు విష్ణు రథం ఎక్కుతున్నాను.. ఆయన మద్ధతుగా తాను నిలుస్తానని.. ఆయన వెనుక తాను ఉన్నానని అన్నారు నరేష్. లోకల్ అనే పదం తాను వాడను.. కాని ప్రకాష్ రాజ్ ఒక టైంలో మాలో ఉన్న వారు ఇక్కడి వారు ఎవరు కూడా సమర్ధులు కాదు.. అందుకే నేను వచ్చానని అన్నారు. ఆయన మాటలు తనకు గట్టిగా తకాయి.. ఆయన గెలిస్తే ఖచ్చితంగా అదే మాట అంటాడు. ఇక్కడివారికి సత్తా లేక ఆయన్ను గెలిపించారు అనే వాదన వస్తుంది. అందుకే మంచు విష్ణునే గెలిపించాలని అన్నారు నరేష్.