చిరు సినిమాలో రవితేజ..!

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత వరుసగా 3 సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. లూసిఫర్ రీమేక్ గా మోహన్ రాజా డైరక్షన్ లో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న చిరు ఈ సినిమాతో పాటుగా మెహర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఇక ఇదే కాకుండా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉంది.

ఈ సినిమాలో చిరుతో పాటుగా మరో హీరో కూడా నటిస్తాడని టాక్. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం చిరు సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా నటిస్తాడని టాక్. చిరు అన్నయ్యలో రవితేజ తమ్ముడిగా నటించాడు. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కూడా రవితేజ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు బాబీ డైరక్షన్ లో సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అఫీషియల్ గా తెలియాల్సి ఉంది.