సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు..!

రిపబ్లిక్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అక్కడ టికెట్ల రేటుపై ఇప్పటికే నిర్మాతలు కొందరు ఏపీ మంత్రి పేర్ని నానితో ఇదివరకే చర్చించారు. బుధవారం మరోసారి ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు చర్చలు జరిపారు. ఈ మీటింగ్ లో నిర్మాతలు దిల్ రాజు, డివివి దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు మరికొంతమంది మీటింగ్ లో పాల్గొన్నారు. 

చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలిసి గతంలో ఏపీ సీ.ఎం ను కలిశాం.. కొవిడ్ ప్రభావం.. పరిశ్రమ సమస్యల గురించి సీ.ఎం దృష్టికి తీసుకెళ్లాం. వకీల్ సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగాయి. అందరూ వివాదాలకు మమ్మల్ని దూరంగా ఉంచండి. గతంలో మా విజ్ఞ్పతిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింద్ది. ఆన్ లైన్ టికెట్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరాము. పవన్ కామెంట్స్ లో దిల్ రాజు గురించి కూడా మాట్లాడటం. ఆ తర్వత దిల్ రాజు మిగతా నిర్మాతలతో ఏపీ మంత్రిని కలవడం హాట్ టాపిక్ గా మారింది.