పవర్ స్టార్ గెస్ట్ గా 'రిపబ్లిక్' ఈవెంట్..!

సాయి ధరం తేజ్ హీరోగా దేవా కట్ట డైరక్షన్ లో వస్తున్న సినిమా రిపబ్లిక్. అక్టోబర్ 1న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 25న ప్లాన్ చేశారు. బైక్ యాక్సిడెంట్ వల్ల సాయి ధరం తేజ్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయినా సరే రిలీజ్ విషయంలో అనుకున్న టైం కు రావాల్సిందే అని దర్శక నిర్మాతలు హీరో లేకుండానే సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో ట్రైలర్ రిలీజ్ చేయించారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

హీరో హాస్పిటల్ లో ఉన్నా సరే సినిమా రిలీజ్ చేయాలని చూడటం ఇదో పెద్ద సాహసమే అని చెప్పాలి. అయితే మెగా హీరో సినిమా అంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. అది కూడా ఇలాంటి టైం లో సాయి ధరం తేజ్ సినిమాకు మేన మామలు తోడుగా సినిమాకు కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నారు.  ప్రస్థానం తో సూపర్ పాపులర్ అయిన దేవా కట్ట నుండి మరోసారి అలాంటి ఓ పవర్ ఫుల్ కథతో వస్తున్న సినిమా రిపబ్లిక్. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కలక్టర్ గా నటించారు. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను జె భగవాన్, జె పుల్లారావు నిర్మించారు.