లైగర్ సెట్ లో బాలయ్య సందడి..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా లైగర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. కొవిడ్ టైం లో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన ఈ చిత్రయూనిట్ లేటెస్ట్ గా తిరిగి షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న టైం లో నందమూరి బాలకృష్ణ సినిమా సెట్ కు సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. షూటింగ్ అప్డేట్స్ తెలుసుకోవడమే కాకుండా సినిమా సక్సెస్ అవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. పూరీతో ఆల్రెడీ పైసా వసూల్ సినిమా చేసిన బాలయ్య బాబు ఆయన డైరక్షన్ లో మరో సినిమా చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది.