
ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి తన డైరక్షన్ లో సెకండ్ సినిమాగా మహా సముద్రం తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించారు. అక్టోబర్ 14న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
లవ్ అండ్ యాక్షన్ ఈ రెండు కలిపి కథగా చెబుతున్నట్టు ఉంది. మహా అన్నది ఈ సినిమాలో ఒక పాత్ర పేరు అని తెలుస్తుంది. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరు బాగా చేసినట్టు అనిపిస్తుంది. సినిమాలో హీరోయిన్స్ కు మంచి స్కోప్ ఉన్న పాత్రలు వచ్చినట్టు ఉన్నాయి. సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.