
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కథ గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అంతకుముందే మహేష్ తో మహర్షి సినిమా తీసి హిట్ అందుకున్న డైరక్టర్ వంశీ పైడిపల్లి మహర్షి తర్వాత మహేష్ తో మరో సినిమా చేయాలని అనుకున్నారు. కథ కూడా మహేష్ కు చెప్పడం.. కొద్దిపాటి మార్పులతో మహేష్ ఆ సినిమా చేయాలని అనుకోవడం తెలిసిందే. అయితే మధ్యలో వేరే ప్రాజెక్ట్ ల వల్ల మహేష్ వంశీ సినిమా లైట్ తీసుకున్నాడు.
ఇప్పుడు తమిళ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి చేసే సినిమా ఇదే అని అంటున్నారు. మహేష్ కథతోనే విజయ్ తో సినిమా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దళపతి విజయ్ కు తెలుగులో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. డబ్బింగ్ సినిమాలతోనే కాకుండా ఈసారి స్ట్రైట్ తెలుగు సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను అలరించాలని ఫిక్స్ అయ్యారు విజయ్.