
సుకుమార్ అసిస్టెంట్ గా చేస్తూ డైరక్టర్ గా మొదటి ప్రయత్నమే ఉప్పెన అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఉప్పెన టేకింగ్ తో బుచ్చి బాబుతో సినిమాకు స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉప్పెన రిలీజ్ టైం లో బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమా ఎన్.టి.ఆర్ తో చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఎన్.టి.ఆర్ తో సినిమా ప్లాన్స్ పక్కన పెట్టి సూపర్ స్టార్ మహేష్ కోసం కథ సిద్ధం చేశాడట బుచ్చి బాబు.
రీసెంట్ గా మహేష్ ను కలిసి బుచ్చి బాబు కథ చెప్పినట్టు టాక్. మహేష్ తన నిర్ణయాన్ని త్వరలో చెబుతానని అన్నారట. ప్రస్తుతం మహేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సర్కారు వారి పాట పూర్తి చేయగానే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడి, రాజమౌళి సినిమాలు లైన్ లో ఉన్నాయి.