
కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వస్తున్న సినిమా ఘోస్ట్. ఈ సినిమాలో నాగ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అయితే ఏమైందో ఏమో కాని సడెన్ గా కాజల్ ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. కాజల్ ప్లేస్ లో గోవా బ్యూటీ ఇలియానా నటిస్తుందని టాక్. తెలుగులో సూపర్ ఫాం లో ఉన్నప్పుడు బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడికి చెక్కేసిన ఇలియానా ఇప్పుడు సౌత్ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
మూడేళ్ల క్రితం రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించిన ఇలియానా ఈసారి నాగ్ సరసన ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. టాలీవుడ్ లో మళ్లీ బిజీ అవ్వాలని చూస్తున్న ఇలియానాకి నాగార్జున సినిమా ఆఫర్ లక్కీ అని చెప్పొచ్చు.