
మాస్ మహరాజ్ రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ విక్రమార్కుడు. రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. విక్రమార్కుడు 2 కథ ఇప్పటికే రైటర్ విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారట. అయితే ఈ సీక్వల్ ను రాజమౌళి డైరక్షన్ చేసే అవకాశాలు లేవని తెలుస్తుంది. ఆల్రెడీ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్న రాజమౌళి విక్రమార్కుడు 2 చేయరని టాక్.
అందుకే ఈ సీక్వల్ కు యువ దర్శకుడు సంపత్ నందికి ఇస్తున్నారని తెలుస్తుంది. తన మాస్ టేకింగ్ తో ఆడియెన్స్ లో తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్న సంపత్ నంది ఆల్రెడీ రాజమౌళితో బెంగాల్ టైగర్ సినిమా చేశాడు. విక్రమార్కుడు 2 కథ పర్ఫెక్ట్ గా కుదిరితే మాత్రం సంపత్ నంది డైరక్షన్ చేస్తాడని చెప్పొచ్చు. సంపత్ నంది డైరక్షన్ టాలెంట్ తెలిసిన రవితేజ ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తారని చెబుతున్నారు.