సైమా (SIIMA) 2019 బెస్ట్ యాక్టర్ గా మహేష్..!

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ (సైమా) వేడుక శనివారం జరిగింది. సమా 2019కి గాను తెలుగు సినీ పరిశ్రమ అవార్డులను అందించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడ్కలో తెలుగు, తమిళ, మళయాళం, కన్నడకు చెందిన సినీ పరిశ్రమలకు అవార్డులను ప్రకటిస్తారు. నాలుగు భాషలకు చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకకు అటెండ్ అయ్యారు. సైమా ఉత్తమ చిత్రంగా జెర్సీ అవార్డ్ అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నారు. 

బెస్ట్ డైరక్టర్ గా వంశీ పైడిపల్లి, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి కేటగిరిలో స్వరూప్ ఆర్.ఎస్.జె ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాకు అవార్డ్ అందుకున్నారు. ఉత్తమ తొలి చిత్ర నటుడి కేటగిరిలో శ్రీ సిం హా మత్తు వదలరా సినిమాకు అందుకోగా బెస్ట్ డెబ్యూ ఫీమేల్ కేటగిరిలో దొరసాని సినిమాకు గాను శివాత్మిక అందుకున్నారు. ఉత్తమ తొలి నిర్మాత కేటగిరిలో స్టూడియో 99 మల్లేశం సినిమాకు అందుకోగా.. ఉత్తమ కమెడియన్ గా రాజు గారి గది 3 సినిమాకు గాను అజయ్ ఘోజ్ అందుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ రోల్ గా అల్లరి నరేష్ మహర్షి సినిమాకు అందుకున్నారు.