జాతిరత్నాలు డైరక్టర్ తో వెంకటేష్..!

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అనుదీప్ కెవి. మొదటి సినిమా పిట్టగోడ పెద్దగా ఆడకపోయినా జాతిరత్నాలు మాత్రం సూపర్ హిట్ అయ్యింది. జాతిరత్నాలు 2 సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. అంతేకాదు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో అనుదీప్ సినిమా ఉంటుందని టాక్. ఇవే కాదు అనుదీప్ డైరక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా ఒక సినిమా వస్తుందని అంటున్నారు.

వెంకటేష్ కు సూటయ్యే కథ సిద్ధం చేశాడట అనుదీప్. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలో స్పెషల్ అప్డేట్ వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనుదీప్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. అనుదీప్, వెంకటేష్ కాంబో కచ్చితంగా స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు.