డిస్నీ హాట్ స్టార్ కు రాం చరణ్ బ్రాండింగ్..!

కరోనా వల్ల థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గి ఓటీటీలో సినిమా చూసే ఆడియెన్స్ సంఖ్య పెరుగుతుందని చెప్పాలి. ఏది ఏమైనా 70 ఎం.ఎం స్క్రీన్ మీద సినిమా చూసే వచ్చే ఆ జోష్ వేరేలా ఉంటుంది. ఓటీటీ సంస్థలు కూడ ఒకాదాన్ని మించి మరోటి పోటీ పడి మరి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్, ఆహా పోటీ పడుతుండగా వీటితో పాటుగా డిస్నీ + హాట్ స్టార్ కూడా రేసులో నిలుస్తుంది. కొత్తగా రాం చరణ్ ఓటీటీని ప్రమోట్ చేస్తున్నారు. డిస్నీ + హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ అందులో వచ్చే సినిమాలు, వెబ్ సీరీస్ ల గురించి ప్రమోట్ చేస్తున్నాడు.

మన వినోద విశ్వం అంటూ కొత్త ట్యాగ్ లైన్ తో డిస్నీ + హాట్ స్టార్ సరికొత్త ఉత్సాహంతో వస్తుంది. తప్పకుండా ఈసారి డిస్నీ + హాట్ స్టార్ మిగతా ఓటీటీలకు ధీటుగా పోటీలో ఉంటుందని అనిపిస్తుంది. లేటెస్ట్ గా నితిన్ నటించిన మాస్ట్రో సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో రిలీజైంది.