
ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇల్లు, ఆఫీసుల మీద ఐడీ అధికారులు సోదాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ రైడ్స్ లో దాదాపు 20 కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టినట్ట్గా మీడియా చెబుతుంది. విదేశీ నిధులను తీసుకోవడంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిబంధనలు ఉల్లఘించినట్టు ఐటీ అధికారులు ప్రకటించారు. సోనూ సూద్ ఇల్లు కార్యాలాయాల మీద దాదాప్ 3 రోజుల పాటు 28 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు. సోనూ సూద్ మాత్రమే కాకుండా అతనికి సంబందించిన వ్యక్తుల ఇల్లలో కూడా సోదాలు నిర్వహించారని తెలుస్తుంది.
కరోనా టైం లో సోనూ సూద్ చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలకు చాలా హెల్ప్ అయ్యాయి. ఒకదశలో ప్రభుత్వాలు కూడా చేయలేని విధంగా సోనూ సూద్ అండ్ టీం కష్టపడ్డారని చెప్పొచ్చు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో కూడా సోనూ సూద్ సేవా కార్యక్రమాలు చేశారు. సోనూ సూద్ చేస్తున్న సాయం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఐటీ దాడులు కూడా హాట్ టాపిక్ గా నిలిచాయి.