పవన్ కళ్యాణ్.. 'భవదీయుడు భగత్ సింగ్'..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అఏ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఆల్రెడీ పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసిన హరీష్ శంకర్ ఆయనతో సెకండ్ సినిమాను మరింత క్రేజీగా చేస్తున్నాడని అర్ధమవుతుంది. ఈసారి ఎంటర్టైన్ మెంట్ తో పాటుగా మంచి సోషల్ మెసేజ్ తో కూడా ఈ సినిమా వస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, హరి హర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత హరీష్ శంకర్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. హరీష్ శంకర్ సినిమా అది కూడా పవర్ స్టార్ తో ఈసారి ఫ్యాన్స్ కు గుర్తుండిపోయే సినిమా ఇచ్చేస్తాడని ఫిక్స్ అవుతున్నారు.