
మాస్ హీరో గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. సెప్టెంబర్ 10న థియేట్రికల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. గోపీచంద్ తో గౌతం నంద తర్వాత సంపత్ నంది చేసిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అవనుంది.
ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లో 565 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా 11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవుతుంది. గోపీచంద్ సీటీమార్ హిట్ అనిపించుకోవాలంటే మాత్రం 12 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంటుంది.