
నాలుగు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ ప్రారంభించింది. ఆదివారం నుండి మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో ఈసారి 19 మంది కంటెస్టంట్స్ ను హౌజ్ లోకి పంపించారు. 106 రోజులు.. హౌజ్ మేట్స్ ఆటలు, పాటలు.. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు.. ఇలా ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్టైన్ అందించేలా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా నాగార్జున చివరి నిమిషంలో ఫిక్స్ అయినట్టు టాక్. సీజన్ 3, 4 లను హోస్ట్ గా చేసిన నాగార్జున సీజన్ 5 చేయాలని అనుకోలేదు. కాని బిగ్ బాస్ హోస్ట్ గా చేసే వాళ్లు ఎవరు లేక మళ్ళీ నాగార్జుననే తీసుకున్నారు.
ఈసారి నాగార్జున కూడా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. సీజన్ 3, 4 ల కన్నా సీజన్ 5 కోసం నాగార్జున భారీగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సీజన్ కోసం నాగార్జున 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. నాగ్ ఎనర్జీ.. హోస్టింగ్ స్టైల్ అన్ని ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.