
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, హరి హర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా త్వరలో హరీష్ శంకర్ డైరక్షన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా రానుంది. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి ఎంటర్టైన్ మెంట్ తో పాటుగా మెసేజ్ కూడా ఇచ్చేలా ప్లాన్ చేశారు హరీష్ శంకర్.
అంతేకాదు ఈ సినిమాకు కథ, కథనాలు పర్ఫెక్ట్ గా కుదిరాయని టాక్. సినిమాకు అంతే పవర్ ఫుల్ టైటిల్ కూడా పెట్టాలని చిత్రయూనిట్ అనుకుంటుందని తెలుస్తుంది. సినిమాకు రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. అందులో ఒకటి భవదీయుడు భగత్ సింగ్ ఒకటి కాగా.. మరొకటి సంచారి అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ రెండిటిలో ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో తెలియాల్సి ఉంది.