
యువ హీరో కార్తికేయ శ్రీ సరిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా రాజా విక్రమార్క. రామ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాలో కార్తికేయ ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది. టాలెంట్ ఉన్నా సరే సరైన సినిమా పడక కెరియర్ లో వెనకపడుతున్న కార్తికేయ రాజా విక్రమార్క సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేలా ఉన్నాడు. సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది.
కార్తికేయ సరసన తన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో తణికెళ్ల భరణి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించగా సినిమా అందుకు తగినట్టుగా ఉంటుందో లేదో చూడాలి. సినిమాలో సాయి కుమార్ కూడా మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది.