సందీప్ కిషన్ గల్లీ రౌడీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

యువ హీరో సందీప్ కిషన్, కామెడీ డైరక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గల్లీ రౌడీ. ఎం.వి.వి బ్యానర్ లో ఎం.వి.వి సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా నేహా శెట్టి నటించింది. అసలైతే సెప్టెంబర్ 3న రిలీజ్ అనుకున్న ఈ సినిమా ఆ డేట్ మిస్సయ్యి సెప్టెంబర్ 17న రిలీజ్ ఫిక్స్ చేశారు. నాగేశ్వర్ రెడ్డి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు బాబీ సిం హా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఇక వరుస సినిమాలు చేస్తున్నా సక్సెస్ విషయంలో వెంకపడ్డ సందీప్ కిషన్ గల్లీ రౌడీ అయిన గట్టెక్కిస్తుందో లేదో చూడాలి. కోనా వెంకట్ కథ అందించిన ఈ సినిమా నుండి ఆమధ్య వచ్చిన టీజర్ ప్రేక్షకులను అలరించింది. మరి సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 17 వరకు వెయిట్ చేయాల్సిందే.