కార్తికేయ 2 బిజినెస్ అదుర్స్..!

నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా కార్తికేయ. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ ప్లాన్ చేశారు. కార్తికేయ 2 టైటిల్ తో కొత్త కథతో వస్తున్నారు నిఖిల్, చందు మొండేటి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతుందని తెలుస్తుంది. సినిమా శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ కలిపి 20 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. కార్తికేయ 2 సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఈ సినిమాతో పాటుగా సూర్య ప్రతాప్ డైరక్షన్ లో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు నిఖిల్. కార్తికేయ 2, 18 పేజెస్ రెండు సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. 18 పేజెస్ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారని తెలిసిందే. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.