
నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లొ హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు పాటల వరకు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. థమన్ ఇచ్చిన సాంగ్స్ సరిపోలేదని హీరో క్యారక్టరైజేషన్ గురించి డైరక్టర్ లాస్ట్ మినిట్ లో ఒక సాంగ్ అనుకున్నారట. ఆ పాటని డైరక్టర్ శివ నిర్వాణ రాయడమే కాకుండా పాడటం విశేషం.
టక్ జగదీష్ టైటిల్ సాంగ్ గా వచ్చిన ఈ సాంగ్ నాని ఫ్యాన్స్ ను అలరిస్తుంది. నాని టక్ జగదీష్ సినిమా సెప్టెంబర్ 10న అమేజాన్ ప్రైం లో రిలీజ్ ఫిక్స్ చేశారు. డైరక్టర్ శివ నిర్వాణ ఈ సినిమా కోసం లిరిసిస్ట్ కం సింగర్ గా మారడం విశేషం.