
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నభా నటేష్ ఆ సినిమాతో యూత్ లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్రస్తుతం యువ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న నభా నటేష్ నితిన్ తో మాస్ట్రో సినిమా చేస్తుంది. ఇదే కాకుండా లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ మూవీ ఛాన్స్ కూడా అందుకుందని తెలుస్తుంది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నభా నటేష్ కు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో ఆల్రెడీ బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా సెలక్ట్ అయినట్టు తెలిసిందే. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నభా నటేష్ ను ఫిక్స్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇస్మార్ట్ బ్యూటీకి స్టార్ ఛాన్స్ రావడం నిజమైతే మాత్రం ఇకమీదట అమ్మడి క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. లేటెస్ట్ గా నభా నటేష్ కు బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది.