పవర్ స్టార్ బర్త్ డే.. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా భీమ్లా నాయక్. మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న భీమ్లా నాయక్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. 

సినిమాలో పవన్, రానా పాత్రలు నువ్వా నేనా అన్నట్టు ఉంటాయని తెలుస్తుంది. థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2022 సన్ర్కాంతి రేసులో ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.