
మహానటి కీర్తి సురేష్ ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంది. కోలీవుడ్ లో పెంగ్విన్, తెలుగులో మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ లేటెస్ట్ గా మరో ప్రయోగాత్మక సినిమాకు రెడీ అవుతుందని తెలుస్తుంది. బాలీవుడ్ లో హిట్టైన మిమి రీమేక్ లో కీర్తి సురేష్ నటిస్తుందని టాక్. స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూ అలరిస్తున్న కీర్తి సురేష్ ఎక్స్ పెరిమెంట్ సినిమాలకు సైన్ చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో వాశి, సాని కాయుదం సినిమాల్లో నటిస్తున్న కీర్తి సురేష్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తుంది.
ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా మిమి రీమేక్ లో కీర్తి సురేష్ నటిస్తుందని టాక్. బాలీవుడ్ లో కృతి సనన్ నటించిన ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ లో స్టార్ కావాలని కలలు కనే ఓ అమ్మాయి ఆర్ధికపరమైన ఇబ్బందులతో ఓ అమెరికన్ జంట కోసం సరోగసి మదర్ అవడానికి ఒప్పుకుంటుంది. అయితే పుట్టబోయే బిడ్డ మానసిక వైఫల్యంతో పుడతాడని డాక్టర్స్ చెప్పడంతో అమెరికన్ జంట వెనక్కి వెళ్తుంది. ఈ క్రమంలో గర్భం దాల్చిన యువతి ఏం చేసింది అన్నది సినిమా కథ. మళయాళ సినిమా రీమేక్. ఇదే కథతో వెల్కన్ ఒబామా టైటిల్ తో తెలుగులో సినిమా చేశారు.