అక్కినేని ఫ్యామిలీ పార్టీ.. సమంత మిస్సింగ్..!

అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ మొత్తం పార్టీ జరుపుకుంది. ఈ అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ పార్టీలో పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో అక్కినేని కోడలు సమంత మిస్ అవడం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సమంత తన సోషల్ మీడియాలో తన పేరు చివరన అక్కినేని అని తీసేసిందని అనుకుంటుండగా నాగార్జున బర్త్ డే సందర్భంగా సమంత నాగ్ మామ అంటూ విష్ చేయడం వ్యవహారం సర్ధుమనిగిందని అనుకున్నారు.

కాని నాగ్ బర్త్ డే పార్టీలో సమంత మిస్ అవడం మళ్లీ అనుమానాలకు తావిస్తుంది. ప్రస్తుతం సమంత తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. అయితే ఎంత బిజీగా ఉన్నా సరే మామ బర్త్ డే కోసం అది కూడా అక్కినేని ఫ్యామిలీ పార్టీ కోసం సమంత రావాల్సింది. కాని ఎందుకో సమంత పార్టీకి మిస్ అయింది. చైతు, సమంతల మధ్య దూరం పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య, సమంతల మధ్య ఏం జరుగుతుంది అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.