పాన్ ఇండియా సినిమాగా సందీప్ కిషన్ మైఖెల్..!

సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయకొడి డైరక్షన్ లో వస్తున్న సినిమా మైఖెల్. ఈ సినిమాలో సందీప్ కిషన్ తో పాటుగా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాను తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. యువ హీరోల్లో తన మార్క్ సినిమాలు చేస్తూ వెళ్తున్న సందీప్ కిషన్ కెరియర్ గ్రాఫ్ అటు ఇటుగా ఉన్నా తన ప్రయత్నాలు చేస్తూ వెళ్తున్నాడు.

ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సందీప్ కిషన్ కోరుకుంటున్న హిట్ సినిమా ఇది అవుతుందా లేదా అన్నది చూడాలి. సినిమా నుండి విజయ్ సేతుపతి ప్రీ లుక్ గా వదిలిన పోస్టర్ మాత్రం అదిరిపోయింది.