శర్వానంద్ 'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన సెకండ్ సినిమా మహా సముద్రం చేస్తున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రచార చిత్రాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 14న రిలీజ్ ఫిక్స్ చేశారు.

దసరా బరిలో అక్టోబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 13న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ట్రిపుల్ ఆర్ రిలీజ్ వాయిదా కన్ ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మహా సముద్రం ఆ స్లాట్ బుక్ చేసుకుంది. దసరా బరిలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా వస్తుందని అంటున్నారు. మరి