
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమా కు సంబందించిన ప్రీ లుక్ మెగా ఫ్యాన్స్ ను అలరించింది. చిరు బర్త్ డే సందర్భంగా గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల టైటిల్ పోస్టర్స్ వదిలారు కాని చిరు 154వ సినిమాకు సంబందించి మాత్రం పోస్టర్ వదిలారు కాని టైటిల్ రివీల్ చేయలేదు. ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య, వీరయ్యన్, వాల్తేర్ శీను టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట.
వీరయ్య, వాల్తేర్ వీరయ్య టైటిల్స్ పై చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారట. అందుకే ఈ సినిమాకు వాల్తేర్ శ్రీను అని టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది కూడా త్వరలో తెలుస్తుంది.