సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ సీజన్ 5..!

నాలుగు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 త్వరలో స్టార్ట్ అవుతుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా రాబోతున్న ఈ సీజన్ లో సెలబ్రిటీ కంటెస్టంట్స్ వస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సెప్టెంబర్ 5న స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే గ్రాండ్ ఎపిసోడ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో హౌజ్ మేట్స్ అందరి పరిచయం.. వారిని హౌజ్ లోకి పంపించడం జరుగుతుంది. 

100 రోజుల దాకా జరుగనున్న బిగ్ బాస్ సీజన్ 5 ఈసారి డిఫరెంట్ టాస్కులతో కొత్త కొత్త కాన్సెప్టులతో ఉండబోతుందని అంటున్నారు. ఇక ఇప్పటికే సీజన్ 5కి వచ్చే కంటెస్టంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవగా ఫైనల్ కంటెస్టంట్స్ ఎవరన్నది మాత్రం ఆరోజు మాత్రమే తెలుస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 5 సందడి మళ్ళీ మొదలు కాబోతుంది. తప్పకుండా ఈ సీజన్ మిగతా అన్ని సీజన్లు కన్నా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.