లైటింగ్ సూరిబాబుతో ప్రభాస్..!

సుధీర్ బాబు హీరోగా పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. సినిమాలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా యూనిట్ తో యంగ్ రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

నిర్మాతలు విజయ్, శశి దేవిరెడ్డిలకు స్నేహితుడైన ప్రభాస్ సినిమాకు సంబందించిన ఆసక్తికరమిన విషయాలతో ఈ ఇంటర్వ్యూ సాగింది. సినిమా లొకేషన్స్, కథ, సుధీర్ బాబు రిస్కీ సీన్స్, యాక్షన్ సీన్స్, కరుణ కుమార్ డైరక్షన్ వీటన్ని గురించి ప్రభాస్ అడిగి తెలుసుకున్నారు. ఏదైనా కథ చెప్పే టైం లో పెద్దగా ప్రభాస్ ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు కాని శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కథపై ప్రభాస్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఆసక్తి చూపించాడని నిర్మాత విజయ్ చిల్లా అన్నారు. ప్రభాస్ ఇంటర్వ్యూతో శ్రీదేవి సోడా సెంటర్ మీద ఆడియెన్స్ లో మరింత ఆసక్తి పెరిగింది.