
నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభ చాటుతున్న అవసరాల శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమా నూటొక్క జిల్లాల అందగాడు. రాచకొండ విద్యాసాగర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్, ఎస్.వీ.సీ.ఎఫ్.ఈ.ఈ బ్యానర్ లు కలిసి నిర్మించారు. సెప్టెంబర్ 3న రిలీజ్ అవబోతున్న సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. బట్టతల వల్ల హీరో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అన్నది సినిమా కథ.
సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. తనకు ఉన్న సమస్యని దాచి పెట్టి.. ప్రేయసి దగ్గర హీరో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అన్నది ఆహ్లాదకరంగా చూపించారు. కామెడీతో పాటుగా ఎమోషనల్ టచ్ తో కూడా సినిమా ఆడియెన్స్ ను మెప్పించేలా చేస్తున్నారు. సినిమాలో అవసరాల శ్రీనివాస్ కు జోడీగా రుహాని శర్మ నటించింది. అవసరాల శ్రీనివాస్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.