మంచి కథలు చెప్పాలని.. యువ నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి..!

సినిమా నిర్మాణం అనేది చాలా మంది బిజినెస్ అనుకుంటుంటే కొందరు మాత్రం దాన్ని ఒక ప్యాషన్ గా చూస్తారు. అదే విధంగా సినిమాలు చేస్తారు. యువ నిర్మాతల్లో ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న నిర్మాత ద్వయం విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి. 70MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వీరు నిర్మిస్తున్న సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటున్నాయి.   

మొదటి సినిమా భలే మంచి రోజు, ఆ తర్వాత ఆనందో బ్రహ్మ 3వ సినిమా యాత్ర. 3 సినిమాలు 3 జోనర్లు చేసిన ఈ నిర్మాతలు మంచి కథలతోనే మేం సినిమాలు చేస్తాం అంటున్నారు. మంచి కథలు కుదిరినప్పుడే సినిమాలు చేస్తా ఈ క్రమంలో సినిమా సినిమాకు గ్యాప్ వస్తుంది అయినా తమ బ్యానర్ లో సినిమా అంటే కథే ముందు ప్రాధాన్య వహిస్తుందని అంటున్నారు. 

ప్రస్తుతం సుధీర్ బాబుతో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. సుధీర్ బాబు మంచి స్నేహితుడని అయినా సరే సినిమా చేసేప్పుడు మాత్రం హీరో, నిర్మాత అనే ప్రొఫెషనల్ గా ఉన్నాం అని చెప్పారు.      

ఈ సినిమా మొదలైన రోజు కెమెరా కిందపడింది.. రెండో రోజు సెట్ లో ఒకరికి కరెంట్ షాక్ కొట్టింది. ఆ తర్వాత విజయ్ చిల్లా బ్రదర్ మరణించారు. ఒక నెల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశామని చెప్పారు. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమా పూర్తి చేశామని అన్నారు. సుధీర్ బాబు ప్రచార చిత్రాలు రిలీజ్ చేశాక సినిమా బిజినెస్ మొత్తం పూర్తయిందని చెప్పారు.

శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలొఓ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. కులం, సామాజిక వర్గం వంటి చర్చల గురించి మాత్రం సినిమాలో చూడాల్సిందే. పలాస చూశాక కరుణ కుమార్ తో సినిమా చేయాలని అనుకున్నాం. కరుణ కుమార్ సినిమా బాగా తీశారని చెప్పారు. సుధీర్ బాబు సూపర్ పర్ఫార్మెన్స్, మణిశర్మ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అన్నారు. ఆనందో బ్రహ్మ తర్వాత తమ దగ్గరకు హర్రర్ కామెడీ కథలే వచ్చాయి. యాత్ర తర్వాత బయోపిక్ కథలు చెప్పారు. చాలా కథలు విన్నాక ఈ సినిమా కథ నచ్చి చేశాం. సినిమా సినిమాకు గ్యాప్ ఎక్కువ తీసుకునే ఉద్దేశం లేదు.. అలా వస్తుందని అన్నారు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. కథ కుదిరితే స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అంటున్నారు ఈ యువ నిర్మాతలు.