సుశాంత్ 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' ట్రైలర్..!

చిలసౌ, అల వైకుంఠపురములో సినిమాలతో హిట్ అందుకున్న సుశాంత్ హీరోగా దర్శన్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇచ్చట వాహనాలు నిలుపరాదు. ఆగష్టు 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మాస్ ఏరియాలో బైక్ పార్కింగ్ వల్ల హీరోకి ఏర్పడ్డ కష్టాలు.. వాటిని అతను ఎలా హ్యాండిల్ చేశాడు అన్నది సినిమా కథ. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ వచ్చిందని చెబుతున్నారు.

సుశాంత్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ అలరించేలా ఉంది. సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా నటిస్తుంది. ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండగా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సుశాంత్ మాత్రం ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు.