
సినిమా నిర్మాత అంటే కేవలం డబ్బులు ఒక్కటి పెడితే సరిపోదు. ఆ సినిమాలతో తమకున్న అభిరుచి కూడా చూపించగగాలి. అలా సినిమాని కేవలం నిర్మించడం అన్నట్టు కాకుండా ప్రేమించి తీసే నిర్మాతల్లో 70MM ఎంటర్టైన్మెంట్స్ విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి లు వస్తారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జోనర్లు. ఫైనల్ గా తాము తీసే సినిమా ఆడియెన్ ను ఎంటర్టైన్ చేయడమే ప్రధాన లక్ష్యం అంటున్నారు ఈ నిర్మాత ద్వయం.
లేటెస్ట్ గా సుధీర్ బాబుతో శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో వస్తున్నారు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. పలాస సినిమాతో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న కరుణ కుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఒక విలేజ్ లవ్ స్టోరీతో వస్తుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యువ నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిల స్పీచ్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
70MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాతల్లో ఒకరైన విజయ్ చిల్లా మాట్లాడుతూ.. ఇక్కడకు వచ్చిన వారంతా ధైర్యంతో వచ్చారని కాదని తాను అనుకుంటున్నానని అన్నారు. అందరు ఇక్కడకు సినిమా మీద ప్రేమతో వచ్చారు. బయటకు రావాలంటే ఇప్పుడు ధైర్యం అక్కర్లేదు మాస్క్ ఉంటే చాలని అన్నారు విజయ్ చిల్లా. మాస్క్ పెట్టుకుని థియేటర్ కు వచ్చి సినిమా చూడండి, సేఫ్ గా ఉండండని అన్నారు. సినిమా మొదలు పెట్టిన మొదటి, రెండు రోజులు కొన్ని బ్యాడ్ సైన్స్ వచ్చాయి. అపశకునం అని అందరు చెప్పినా సరే సినిమా మోషన్ పోస్టర్ తోనే బిజినెస్ స్టార్ట్ అయ్యింది.. ఫస్ట్ ట్రైలర్ తో అన్ని భాషల్లో బిజినెస్ అయ్యిందని అన్నారు నిర్మాత విజయ్ చిల్లా.
సినిమా మరో నిర్మాత శశి దేవిరెడ్డి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీదేవి సోడా సెంటర్ మొదటి సాంగ్ రిలీజ్ చేసినందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పారు శశి దేవిరెడ్డి. ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకి థ్యాంక్స్ చెప్పారు. సినిమాను సపోర్ట్ చేసిన డార్లింగ్ ప్రభాస్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఇక పి.ఆర్ టీం. మీడియా, క్రిటిక్స్ అందరికి థ్యాంక్స్ చెప్పారు. మీరు ఉన్నంత కాలం తెలుగు సినిమా ముందుకెళ్తుందని అన్నారు. ఇక తెలుగు ఆడియెన్స్ ఉన్నంత వరకు పాన్ ఇండియా రేంజ్ లో సినిమా వెళ్తుందని అన్నారు. తెలుగు ఆడియెన్స్ పాన్ ఇండియా ఆడియెన్స్ అన్నారు నిర్మాత శశి దేవిరెడ్డి. ఒక తెలుగు సినిమా హిట్టైతే అది ఇండియా మొత్తం హిట్ అవుతుందని అన్నారు. శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగానే సినిమా బిజినెస్ జరిగింది. కరుణ కుమార్ తో వేరే సినిమా చేయాల్సి ఉంది. పలాస చూశాక రెండు రోజుల్లో కిక్ వచ్చింది. ఈ డైరక్టర్ తో సినిమా చేయాలని అనుకున్నాం. ఆయనతో మరో సినిమా చేస్తామని అన్నారు శశి దేవిరెడ్డి.
70MM ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా వస్తుంది అంటే ఆడియెన్స్ కు 3 గంటలు సినిమా ఎంటర్టైన్ చేయాలని.. అదే తమ గోల్ అని అన్నారు నిర్మాత శశి దేవిరెడ్డి. ఇప్పటివరకు 3 సినిమాలు చేశాం. శ్రీదేవి సోడా సెంటర్ వాటిని మించి వస్తుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు శ్రీదేవి సోడా సెంటర్ ఓవర్సీస్ లో కూడా భారీగా రిలీజ్ అవుతుందని అన్నారు. ఇక సుధీర్ బాబు గురించి మాట్లాడుతూ సుధీర్ కోసం భలే మంచి రోజు నుండి ఎప్పుడూ తన కోసం ఉంటాం.. అది బిగ్ అయితే శ్రీదేవి సోడా సెటర్ బిగ్గర్.. వెయిట్ ఫర్ బిగ్గెస్ట్ అని అన్నారు శశి దేవిరెడ్డి.