
మెగాస్టార్ చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా చేస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మోహన్ రాజా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ తో పాటుగా గన్ తో ఉన్న చిరు లుక్ కూడా రిలీజ్ చేశారు. ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఇదే కాకుండా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమా నుండి ఒక సర్ ప్రైజ్.. మెహెర్ రమేష్ డైరక్షన్ లో రాబోతున్న సినిమా నుండి మరో గిఫ్ట్ రాబోతుందని తెలుస్తుంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ వరుస సినిమాల డీటైల్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.