
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా RRR. ఎవరు ఊహించని ఈ మల్టీస్టారర్ సినిమాతో మరోసారి తెలుగు సినిమా స్టామినా చూపించడానికి రెడీ అవుతున్నాడు రాజమౌలో. అయితే ట్రిపుల్ ఆర్ బాటలోనే మరో మల్టీస్టారర్ సినిమా కూడా రెడీ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. సాహో డైరక్టర్ సుజిత్ ఓ క్రేజీ మల్టీస్టారర్ కథ సిద్ధం చేశాడట. ఈ సినిమాలో ప్రభాస్, చరణ్ నటిస్తారని టాక్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఆ హంగామా వేరే రేంజ్ లో ఉంటుంది. ఈ మల్టీస్టారర్ వస్తే బాక్సాఫీస్ బద్ధలు కొట్టడం ఖాయం. మరి నిజంగానే ప్రభాస్, రాం చరణ్ మల్టీస్టారర్ సినిమా ఉంటుందా.. ఈ మల్టీస్టారర్ సినిమాపై వస్తున్న వార్తలపై త్వరలో క్లారిటీ వస్తుంది.