నాంది డైరక్టర్ తో నాగ చైతన్య..!

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల డైరక్షన్ లో వచ్చిన సినిమా నాంది. వరుస ఫ్లాపులతో కెరియర్ లో వెనకపడ్డ అల్లరి నరేష్ కు నాంది హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది. సీరియల్స్ లో పనిచేసిన అనుభవంతో అసిస్టెంట్ డైరక్టర్ గా చేసి నాందితో మొదటి సినిమాతోనే సత్తా చాటాడు డైరక్టర్ విజయ్ కనకమేడల. ఈ డైరక్టర్ తన సెకండ్ సినిమా అక్కినేని హీరోతో చేస్తాడని తెలుస్తుంది. చైతన్యకు విజయ్ ఒక కథ వినిపించాడట కథ నచ్చిన చైతన్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.

ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేశాడు. సెప్టెంబర్ 10న ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత చైతన్య విక్రం కుమార్ డైరక్షన్ లో థ్యాంక్యు సినిమా చేస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఎండింగ్ దశకు వచ్చిందని తెలుస్తుంది. నాంది డైరక్టర్ తో నాగ చైతన్య సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.