రవితేజ మనసు గెలిచిన రాజ రాజ చోర..!

శ్రీవిష్ణు హీరోగా నూతన దర్శకుడు అసిత్ గోలి డైరక్షన్ లో వచ్చిన సినిమా రాజ రాజ చోర. గురువారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులంతా సూపర్ అనేస్తుండగా సినిమాకు సెలబ్రిటీస్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరక్టర్ అనీల్ రావిపుడి సినిమా చూసి సూపర్ అనేయగా లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో మాస్ మహరాజ్ రవితేజ చేరారు.

రాజ రాజ చోర సినిమా చూసిన రవితేజ సినిమా ఎంటర్టనింగ్.. ఎమోషనల్ గా ఉందని ట్వీట్ చేశారు. సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేశానని చెప్పారు. శ్రీ విష్ణు, డైరక్టర్ హసిత్ గోలి టీం మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు. రవితేజ ట్వీట్ తో రాజ రాజ చోర సినిమాపై మరింత బజ్ ఏర్పడిందని చెప్పొచ్చు.