సర్కారు డైరక్టర్ నెక్స్ట్ ఎవరితో అంటే..!

సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమా డైరెక్ట్ చేస్తున్న పరశురాం ఆ సినిమా తర్వాత అక్కినేని హీరోతో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. గీతా గోవిందం తర్వాత నాగ చైతన్యతో సినిమా చేయాలని అనుకున్నాడు పరశురాం అయితే ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇక లేటెస్ట్ గా సర్కారు వారి పాట తర్వాత చైతన్యతోని పరశురాం సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఎలాగు మహేష్ సినిమాతో పరశురాం కు స్టార్ క్రేజ్ రావడం పక్కా అందుకే చైతు కూడా పరశురాం డైరక్షన్ లో సినిమాకు ఓకే చెప్పినట్టు టాక్.

ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరక్షన్ లో చేసిన లవ్ స్టోరీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాతో పాటుగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో కూడా నాగ చైతన్య థ్యాంక్యు సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత పరశురాం తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. సర్కారు హిట్ పడితే పరశురాం తో చైతు సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంది.