నిర్మాతల కోసం నాని తలొగ్గక తప్పలేదా..!

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమా నిర్మించారు. సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాను ముందు థియేట్రికల్ రిలీజ్ చేయాలని అనుకున్నా కరోనా సెకండ్ వేవ్ వల్ల అది వాయిదా పడ్డది. నిర్మాతలపై భారం పడుతుండటంతో టక్ జగదీష్ ను ఓటీటీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే నాని మాత్రం తన సినిమా లేట్ అయినా థియేట్రికల్ రిలీజ్ కావాలని పట్టుబడుతున్నాడు.

అయితే ప్రస్తుతం థియేటర్లు తెరచుకున్నా ఆంధ్రాలో ఇంకా నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది.. అక్కడ 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ.. రోజుకి 3 షోలు మాత్రమే వేస్తున్నారు. ఈ టైం లో టక్ జగదీష్ రిలీజ్ కష్టమని భావించిన నిర్మాతలు ఓటీటీకే మొగ్గు చూపుతున్నారు. ఇక నాని కూడా ఈ విషయంపై ఓ ఓపెన్ లెటర్ షేర్ చేసుకున్నాడు. టక్ జగదీష్ సినిమా పై తన మనసులో మాట బయట పెట్టాడు నాని. తాను మరోసారి క్రాస్ రోడ్స్ లో నిలబడినట్టు అయ్యిందని.. ఆవేదన వ్యక్తం చేశారు నాని. సినిమా అభిమానిగా అభిమానులతో, ప్రేక్షకులందరితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటమే తనకు ఇష్టమని.. టక్ జగదీష్ సినిమాను కూడా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసమే చేశామని.. కరోనా పాండమిక్ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిందే.. ఆంధ్రాలో ఇంకా కొన్ని థియేటర్లు పూర్తిగా తెరచుకోలేదు. నిర్మాతలకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టక్ జగదీష్ రిలీజ్ నిర్ణయం వారికే వదిలేశానని క్లారిటీ ఇచ్చారు నాని. నిర్మాతలు మనసు మార్చుకుని థియేట్రికల్ రిఈజ్ చేస్తే ముందు ఆనందించే వ్యక్తిని నేనే అంటూ నాని లెటర్ లో తెలిపాడు. మొత్తానికి నాని టక్ జగదీష్ రిలీజ్ విషయంలో బాగా నలిగిపోతున్నాడని అర్ధమవుతుంది.