
సుధీర్ బాబు హీరోగా కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. విలేజ్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే లైటింగ్ సూరి బాబు.. సోడాల శ్రీదేవి ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే అతని మీద ప్రేమని తండ్రికి చెబుతుంది శ్రీదేవి. మంచోడే కాని మనోడు కాదు అన్న డైలాగ్ సినిమా కాన్సెప్ట్ ను తెలియచేస్తుంది.
సినిమాలో సుధీర్ బాబు నట విశ్వరూపం చూపించాడని చెప్పొచు. తన సిక్స్ ప్యాక్ లుక్ అదిరిపోయింది. లైటింగ్ సూరి బాబుగా సుధీర్ సోడాల శ్రీదేవిగా ఆనంది అదరగొట్టేశారని తెలుస్తుంది. ఇక మణిశర్మ మ్యూజిక్ అదిరిపోయింది. శ్రీదేవి నాది.. ఎప్పటికి నాదే అంటూ సుధీర్ ఇంటెన్షన్స్ తో చెప్పే డైలాగ్ అదిరిపోయింది. మొత్తానికి సుధీర్ బాబు సినిమా ట్రైలర్ తోనే వావ్ అనిపించేలా చేసింది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు డైరక్టర్. ఈ సినిమాను 70 MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఆగష్టు 27న శ్రీదేవి సోడా సెంటర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.