అన్న 1 వస్తే.. 8న తమ్ముడు వస్తున్నాడు..!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్, ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ ఇద్దరు మెగా అన్నదమ్ములు వారం గ్యాప్ తో బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. దేవా కట్ట డైరక్షన్ లో రిపబ్లిక్ సినిమాతో వస్తున్నాడు సాయి ధరం తేజ్. ఈ సినిమాను అక్టోబర్ 1న రిలీజ్ ఫిక్స్ చేశారు. మొదట్లో ఓటీటీ డీల్ కుదుర్చుకున్న ఈ సినిమా ఆ డీల్ క్యాన్సిల్ చేసుకుని మళ్లీ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 1న రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాకు పోటీగా వైష్ణవ్ తేజ్, క్రిష్ మూవీ వస్తుంది.

ఉప్పెన సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ తన సెకండ్ సినిమాకు సూపర్ బజ్ ఏర్పరచుకున్నాడు. క్రిష్ డైరక్షన్ లో కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమా వస్తుంది. సినిమాను అక్టోబర్ 8న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అంటే వారం గ్యాప్ లో మెగా బ్రదర్స్ ఇద్దరు తమ సినిమాలతో వస్తున్నారు. సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరు ఒకేసారి మెగా ఫ్యాన్స్ ను అలరించడానికి వస్తున్నారు.